కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 05 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ సా.4.51 కు తదుపరి తదియ 6 సా.5.33 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తర ఉ.8.16 కు తదుపరి హస్త 6 ఉ.9.23 కు
యోగం: గండ ఉ.7:05 కు తదుపరి వృద్ధి 6 ఉ.6:52 కు
కరణం: గరజి సా.5:04 కు తదుపరి విష్టి సా.5:53 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.30 - 11.17 కు, మ. 3.12 - 3.59 కు
వర్జ్యం: సా.5.04 - 6.44 కు
అమృతకాలం: తె. 02.22 - 04.03 కు
సూర్యోదయం: ఉ. 6.35 కు
సూర్యాస్తమయం: సా. 6.19 కు
గురుబోధ:
🕉️అష్టాదశ పురాణములు, రామాయణం , శ్రీ మద్భాగవతం, మహాభారతం వంటి పురాణములు వింటే వచ్చే పుణ్యం మనలని మన ముందు తరాలని, మన తరువాతి తరాలని కూడా రక్షిస్తుంది.
🕉️కేవలం దేవాలయం దర్శనానికి వెళ్ళడమే కాకుండా ఆలయ నిర్వహణకు కావల్సిన కనీస సదుపాయాలు అందించడం, ఆలయం శుభ్రపరచడం మొ|| చేయడం ఎన్నో శుభఫలితాలను ప్రసాదిస్తుంది, భగవంతుని సంతోషపరుస్తుంది, వచ్చే జన్మలు ఉత్తమజన్మలు వచ్చేలా చేస్తుంది. ధర్మరాజాదులు సైతం ఆలయసేవ చేసారని మనకు పురాణాలు చెపుతున్నాయి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial