కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 18 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము శుక్ల పక్షం
తిథి: పాడ్యమి సా.5.26 కు తదుపరి విదియ 19 సా.4.43 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: శతభిషం రా.10.00 కు తదుపరి పూర్వాభాద్ర 19 రా.9.49 కు
యోగం: శివ రా.10:44 కు తదుపరి సాధ్య 19 సా.6:23 కు
కరణం: బవ సా.4:58 కు తదుపరి కౌలవ 19 సా.3:59 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ. 12.06 - 12.52 కు
వర్జ్యం: తె.4.21 - 5.56 కు
అమృతకాలం: మ. 01.21 - 02.57 కు
సూర్యోదయం: ఉ. 6.44 కు
సూర్యాస్తమయం: సా. 6.15 కు
🕉️ ఫాల్గున మాసం ప్రారంభం 🕉️
గురుబోధ:
🕉️ దుఃఖానికి మూలం జీవులు చేసే పాపాలు. పాపాలు కర్మను అనుసరిస్తాయి. మరలా మరలా కర్మలు చేసేలా జీవుడ్ని ప్రేరేపిస్తాయి. ఈ కర్మల నుండి బయటపడడం అంత తేలికకాదు. పోతన భాగవతంలో “తనువులు పెక్కైన చెడవు తనకర్మంబుల్” అంటారు. ఎన్ని జన్మలు ఎత్తినా కర్మబంధాల నుండి మాత్రం బయటపడలేక జీవులు నానాయాతనలు పడుతుంటారు. ఈ కర్మఫలాలు తొలగించి సకలదుఃఖవినాశనం చేసే దివ్య మాసం ఫాల్గున మాసం.
🕉️ఫాల్గునమాసంలో ఆవునెయ్యి, ఆవుపెరుగు, తేనె - ఈ మూడింటితో శివలింగాన్ని అభిషేకించినవారికి తొంబది (90) రోజుల్లో సంపదలు లభిస్తాయి. ఫాల్గునమాసాన్ని సద్వినియోగం చేసుకొని దుఃఖవిముక్తిని పొందండి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial