Feb 11 2026ఫిబ్రవరి 11 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 11 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి ఉ.9.26 కు తదుపరి దశమి 12 ఉ.11.45 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: అనూరాధ ఉ.10.51 కు తదుపరి జ్యేష్ఠ 12 మ.1.27 కు
యోగం: వ్యాఘాత రా.2:29 కు తదుపరి హర్షణ 12 తె.3:05 కు
కరణం: వణిజ రా.11:12 కు తదుపరి బవ 12 రా.1:27 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ. 12.07 - 12.53 కు
వర్జ్యం: మ.3.03 - 6.49 కు
అమృతకాలం: తె. 03.50 - 05.38 కు
సూర్యోదయం: ఉ. 6.48 కు
సూర్యాస్తమయం: సా. 6.12 కు

గురుబోధ:
బ్రహ్మ, విష్ణువుల ఇద్దరి మధ్య యుద్ధం ఆపడం కోసం మాఘ మాసం లో లోకశ్రేయస్సు కోసం ఈశ్వరుడు ఒక అగ్నిస్తంభరూపం ధరించాడు. ఇది శివలింగం అని పిలువబడుతుంది. ఈ లింగమునకు రూపమూ ఉంది. రూపమూ లేదు. ఆకారము ఉంటుంది కాబట్టి లింగం ఇటు సగుణము, నిర్గుణము కూడా. శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు మీ యుద్ధం ఆపడానికి లింగం రూపం ధరించాను, కనుక ఈ కాలమును లింగోద్భవకాలము అని అంటారు. ఈ లింగోద్భవకాలములో తనను అర్చించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసములో నివసిస్తారు. వారికున్న ఈతి భాధలు తొలగిపోతాయి అని పరమశివుడు వరమిచ్చాడు.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అమృత ప్రవచనాలు
👉🏻 ఫిబ్రవరి 11, 2026 (ఉదయం); 🗓️సమయం: ఉ|| 10 గం.ల నుండి మ.12 గం.ల వరకు "భగవత్ రామానుజాచార్య స్వామి మరియు అష్టాక్షరీ మంత్ర వైశిష్ట్యం" 📍వేదిక: శ్రీ తల్పగిరి రంగనాథస్వామివారి దేవాలయం, రంగనాయకుల పేట, నెల్లూరు
👉🏻 ఫిబ్రవరి 11 2026 (సాయంత్రం); 🗓️ సమయం: సా|| 6:30 గం.ల నుండి రా.8:30 గం.ల వరకు "శ్రీ రామాయణ వైశిష్ట్యం" , 📍వేదిక: వేంకటేశ్వర స్వామి ఆలయం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less