కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 24 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం
తిథి: షష్ఠి రా.11.00 కు తదుపరి సప్తమి 25 రా.9.10 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర మ.1.19 కు తదుపరి రేవతి 25 మ.12.16 కు
యోగం: సిద్ధ ఉ.11:45 కు తదుపరి సాధ్య 25 ఉ.9:11 కు
కరణం: కౌలవ మ.1:16 కు తదుపరి గరజి 25 ఉ.11:58 కు, వణిజ 25 రా.11:10 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.22 - 9.07 కు
వర్జ్యం: రా.12.47 - 2.19 కు
అమృతకాలం: ఉ. 09.30 - 11.05 కు
సూర్యోదయం: ఉ. 6.53 కు
సూర్యాస్తమయం: సా. 6.03 కు
🕉️ స్కందషష్ఠి, కుమార షష్ఠి, శ్యామలానవరాత్రులు 6వ రోజు🕉️
గురుబోధ:
🕉️ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామివారిని భక్తితో అర్చించి, దేవాలయ సందర్శన, స్వామివారికి అభిషేకం, నామజపం, ప్రదక్షిణలు, షష్ఠీదేవి స్తోత్రం, సుబ్రహ్మణ్యస్వామి వారి స్తోత్రాలు పారాయణం చేయడం వలన అనేక శుభఫలితాలు పొందుతారు.
🕉️స్కందోత్పత్తి ఘట్టము, కుమారస్వామి చరిత్ర, తారకాసురవధ వినడం వలన సకలపాపాలు తొలగి, సమస్తశుభాలు ప్రాప్తించి, భోగభాగ్యాలు, ముక్తి లభిస్తుంది. తారకాసురుడిని, ప్రలంబాసురుడిని మొదలైన అసురుల్ని సంహరించిన కారణజన్ముడైన శివపార్వతీ తనయుడు, కుమారస్వామి గాధ విన్నవారు తప్పక మోక్షం పొంది తీరుతారు. శివుడు తన పుత్రుడైన కార్తికేయుని పూజిస్తే ఎంతో సంతోషించి సర్వమంగళములను ప్రసాదిస్తాడు.
https://youtu.be/HzagOETvUGw
మంగళ షష్ఠీ లేదా దేవసేనా స్తోత్రం👇
https://youtu.be/z5AyoV476mQ?si=y1hkCEE6oBCJQgIi
PDF - https://srivaddipartipadmakar.org/stotram/shasti-devi-stotrasridevibhagavatam/
శ్యామలా దండకం👇
https://youtu.be/zGlmVMlrIsw?si=GhFrtzDf3QHoulCK
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial