కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 22 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి రా.1.36 కు తదుపరి పంచమి 23 రా.12.30 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: శతభిషం మ.2.16 కు తదుపరి పూర్వాభాద్ర 23 మ.2.00 కు
యోగం: పరిఘ మ.3:58 కు తదుపరి శివ 23 మ.2:01 కు
కరణం: వణిజ మ.2:41 కు తదుపరి బవ 23 మ.2:10 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.36 - 11.20 కు, మ. 3.03 - 3.48 కు
వర్జ్యం: రా.8.35 - 10.10 కు
అమృతకాలం: ఉ. 07.05 - 08.43 కు
సూర్యోదయం: ఉ. 6.53 కు
సూర్యాస్తమయం: సా. 6.01 కు
🕉️ శ్యామలానవరాత్రులు 4వ రోజు 🕉️
గురుబోధ:
శ్లో. మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ |
కుర్యాత్ కటాక్షం కల్యాణీ కదంబవనవాసినీ ||
🕉️ అమ్మవారికి ఉన్న చాలా రూపాలలో ఒక రూపం శ్యామలాదేవి. ఈవిడ ఇంచుమించుగా మరకతమనేటటువంటి ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
🕉️మాఘమాసం శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు వచ్చే నవరాత్రులను శ్యామలానవరాత్రులు అంటారు. అమ్మవారిని ఈ 9 రోజులు సూర్యోదయ సమయానికి స్నానం పూర్తి చేసుకుని కుంకుమతో అమ్మని పూజించి, కొంచెం పాయసం నివేదించి మనం తినాలి. ఇలా చేయడం వల్ల: 1) కుటుంబవృద్ధి 2) ధనధాన్యవృద్ధి 3) ఇంట్లో అకాల మరణములు ఉండవు 3) భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది 4) పెళ్ళి కావలసిన స్త్రీ, పురుషులకు వివాహయోగం కలుగుతుంది. ఇంకా అనేక శుభఫలితాలను శ్యామలాదేవి ప్రసాదిస్తుంది.
శ్యామలా దండకం👇
https://youtu.be/zGlmVMlrIsw?si=GhFrtzDf3QHoulCK
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial