Jan 15 2026జనవరి 15 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 15 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: ద్వాదశి రా.8.13 కు తదుపరి త్రయెదశి 16 రా.10.15 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: జ్యేష్ఠ 16 తె.6.13 కు తదుపరి మూల 17 ఉ. 8.38 కు
యోగం: ధ్రువ రా.9:06 కు తదుపరి వ్యాఘాత 17 రా.9:17 కు
కరణం: తైతుల రా.8:17 కు తదుపరి వణిజ రా.10:22 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.34 - 11.19 కు, మ. 3.00 - 3.44 కు
వర్జ్యం: ఉ.9.50 - 11.37 కు
అమృతకాలం: సా. 07.58 - 09.45 కు
సూర్యోదయం: ఉ. 6.53 కు
సూర్యాస్తమయం: సా. 5.57 కు

🕉️ మకరసంక్రమణ జనవరి 15, (గురువారం) మధ్యాహ్నం 12.52 గం.ల వరకు ఉంది. మకర సంక్రాంతి రోజున ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే కైలాసానికి వెడతారు. 🕉️

గురుబోధ:
🕉️ప్రతి సంవత్సరం వచ్చే పండుగలు, దేవతలకు సంబంధించిన పర్వదినముల వంటివాటిని యథాశక్తి ఇంటిల్లపాది తప్పక ఆచరించాలి. ఇది మన సంప్రదాయం. వీటిని ఆచరించడం వలన ఆ ఇంటి లోనివారికి, వారి పిల్లలకి ఆ సంవత్సరం అంతా శుభములు కలుగుతాయని శాస్త్రం. ఎన్ని సంపదలున్నా ఏ పని చేయకుండా కాలక్షేపం చేస్తే, ఆ సంపదలు ఎలా తరిగిపోతాయో అలానే పండుగలు వంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే పుణ్యం తరిగిపోయి కొంత కాలం తరవాత లేదా రాబోవు తరాలకు దైవానుగ్రహం లేక ఇంటిల్లిపాది కష్టాలు పడాల్సివస్తుంది.
🕉️పండుగ వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి, పిల్లలకి తప్పక చెప్పాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఆ రోజు చేసే పూజ, జప, తప లేదా ఇతర పుణ్యకార్యముల వల్ల వేల రెట్ల ఫలితం లభిస్తుంది. ఉదా౹౹ సంక్రాంతి నాడు లక్ష్మీదేవిని పూజించడం, అర్చించడం వంటివి చేయడం వల్ల అమ్మవారు సులభంగా అనుగ్రహిస్తుంది.
🕉️సంక్రాంతి నాడు గోపూజ చేయాలి. మకరసంక్రమణం రోజున దర్భాసనం పై కూర్చుని లక్ష్మీదేవిని పూజించండి. పూజించేటప్పుడు అమ్మవారికి చెఱకు ముక్కలు, చెఱకు పానకం నైవేద్యంగా సమర్పించి తామరపూలతో పూజించినట్లైతే వెంటనే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.
🕉️మకర సంక్రమణం నాడు సూర్యాస్తమయం అయ్యాక భగవద్గీత వినాలి ఈ రోజున బ్రహ్మవైవర్త పురాణం, భాగవతం వినాలి లేదా మీ ఇష్టదేవతలకు చెందిన చరిత్రను సూర్యాస్తమయం నాడు వినండి ఈ రోజు పురాణం వింటే సకల దోషాలు నుంచి విముక్తి పొందుతారు.
🕉️శ్రీ మహావిష్ణువు ఈ స్తోత్రం విన్నవారిని రక్షించే బాధ్యత తనదేనని, రక్షణకై తన సుదర్శన చక్రమే పంపుతానని అన్నాడు. ఇది హరిరక్షణ పొందించే అద్భుత స్తోత్రం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం పొందే కష్టాల నుండి బయటపడవేసే అపూర్వ స్తోత్రం. వీలున్నప్పుడల్లా ఇది విన్నా, ముఖ్యంగా అమావాస్యలలో, సంక్రాంతి పర్వదినాలలో, గ్రహణాలలో, నదీస్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాము.

శ్రీ మహావిష్ణు వేదస్తుతి👇
https://youtu.be/UwFKCtE_fRU?si=jylq5HU7nXzkP29O
అగస్త్యకృత మహాలక్ష్మీస్తోత్రం👇
https://youtu.be/yUXkM_QhZgA?si=WGHsoComlWCselCH

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less