కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 12 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం
తిథి: నవమి మ.1.58 కు తదుపరి దశమి 13 మ.3.55 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: స్వాతి రా.10.35 కు తదుపరి విశాఖ 13 రా.1.02 కు
యోగం: శూల రా.7:04 కు తదుపరి గండ రా.7:55 కు
కరణం: వణిజ తె.2:00 కు తదుపరి విష్టి మ.3:18 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.46 - 1.30 కు, మ. 2.58 - 3.43 కు
వర్జ్యం: తె.4.45 - 6.31 కు
అమృతకాలం: ఉ. 11.13 - 01.00 కు
సూర్యోదయం: ఉ. 6.53 కు
సూర్యాస్తమయం: సా. 5.55 కు
🕉️స్వామి వివేకానంద జయంతి 🕉️
గురుబోధ:
లక్ష్మీదేవి ఒకసారి ఇలా అన్నది, నాకు సంక్రాంతి అంటే ఇష్టం సంక్రాంతి నాడు గోపూజ చేసిన వారిని గోక్షీరంతో పాయసం వండి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించిన వారిని, ఆవుపేడతో ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టిన వారిని ,అనుగ్రహిస్తానని లక్ష్మీదేవి చెప్పింది. లక్ష్మి వాక్కులను శిరోధార్యంగా భావించి ప్రజలు అలా చేసి తరిస్తున్నారు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial