కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 27 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం
తిథి: పుష్య శుద్ధ సప్తమి ఉ.09.02 వరకు తదుపరి అష్టమి
వారం: స్థిరవారము
నక్షత్రం: ఉత్తరభాద్ర
28 తెల్లవారి 05.13ని౹౹ల వరకు ఉంది.
యోగం: వ్యాతిపాత మ.12.22 వరకు
కరణం: వనిజ మ.01.09 వరకు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.06:21-07:58 వరకు
వర్జ్యం: మ.03.20-04.53 కు
అమృతకాలం: రా.12:34-02:07కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు
గురుబోధ:
పుస్తకాలు చదవడం మంచి అలవాటు. గొప్పవారందరికి పుస్తకము చదివే అలవాటు ఉంటుంది. పిల్లలచేత మంచి కథలు చదివించాలి. వినిపించాలి. వాటివల్ల ఏకాగ్రత పెరుగుతుంది.