Dec 21 2025డిసెంబరు 21 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 21 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: పుష్య శుద్ధ పాడ్యమి ఉ.10.22 కు తదుపరి విదియ 22 ఉ.11.41 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పూర్వాషాఢ రా.3.14 కు తదుపరి ఉత్తరాషాఢ 22 సా.4.47 కు
యోగం: వృధ్ది సా.4.35 కు తదుపరి ధ్రువ సా.4.40 కు
కరణం: బవ ఉ.8.11 కు తదుపరి బాలవ రా.10.04 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.04:15-04:59 కు
వర్జ్యం: ఉ.11.49-1.31 కు
అమృతకాలం: రా.10:21-12:06 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు

🕉️ పుష్యమాసం ఆరంభం, గాణగాపురం శ్రీ నృసింహ సరస్వతీ స్వామి (దత్తాత్రేయ) జయంతి🕉️

గురుబోధ:
🕉️దత్తాత్రేయుడు చాలా భక్త సులభుడు. ఆయనని నమ్మి భక్తితో నమస్కరించినా కూడా ప్రసన్నుడు అవుతాడు. నిజమైన భక్తులను ఆయన పరీక్షిస్తాడు. ఆ దత్తాత్రేయుడిని నమ్మి ఆ పరీక్ష తట్టుకుని నిలబడగలిగితే ఆయన ప్రసన్నుడు అయి ఎప్పటికీ రక్షిస్తుంటాడు.
🕉️దత్తాత్రేయుని 24 అవతారాలలో ముఖ్యమైనవి శ్రీ పాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి అవతారములు.

https://youtu.be/TN1O0jpvUSQ

https://youtu.be/qdC3yYU5PAg

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less