కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 19 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్దశి ఉ.6.35 కు తదుపరి మార్గశిర అమావాస్య 20 ఉ.8.57 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: జ్యేష్ఠ రా.10.32 కు తదుపరి మూల 20 రా.1.32 కు
యోగం: శూల మ.3.46 కు తదుపరి గండ సా. 4:16 కు
కరణం: చతుష్పాద సా.6.08 కు తదుపరి నాగ ఉ. 7.13 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8.56-9.39 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ.01:02 - 02:49 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు
🕉️ కేతు జయంతి, అమామూలా యోగము, అమావాస్య(శ్రాద్ధములకు)🕉️
గురుబోధ:
అమావాస్య నాడు తప్పక పితృదేవతలను ఉద్దేశించి స్వయంపాకం దానం ఇవ్వాలి. పితృస్తోత్రం,శివకేశవ అష్టోత్తరము మొ౹౹ పారాయణములు చేయాలి.
కేతుగ్రహ ప్రీత్యర్థం ఉలవలు దానం చేసినవారికి సకలబాధలూ తొలగిపోతాయి. ఊపిరితిత్తుల రోగాలు తత్ క్షణమే తొలగిపోతాయి. కేతుగ్రహ ధ్యానశ్లోకం:
శ్లో|| పలాశపుష్ప సంకాశం | తారకాగ్రహమస్తకం ||
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||
పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఆ ఇంటిలో అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటారు. పిల్లల భవిష్యత్ బాగుంటుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial