Dec 14 2025డిసెంబరు 14 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 14 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం

తిథి: దశమి రా.10.41 కు తదుపరి ఏకాదశి 15 రా.12.14 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: హస్త ఉ.10.49 కు తదుపరి చిత్త 15 మ.12.54 కు
యోగం: సౌభాగ్య ఉ.11.45 కు తదుపరి శోభన 15 మ.12.29 కు
కరణం: విష్టి సా.6.50 కు తదుపరి బవ ఉ.8.03 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4.11-4.55 కు
వర్జ్యం: రా.7.38-9.20 కు
అమృతకాలం: తె.03:59-05:46 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు

🕉️ శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఆరాధన🕉️

గురుబోధ:
దుర్గానామం తనకు చాలా ఇష్టమని ఈ నామాన్ని నిత్యం భక్తితో జపించేవారికి గల కష్టాలన్నీ తత్  క్షణం తాను తొలగిస్తాననీ అమ్మవారు స్వయంగా లోపాముద్రకు చెప్పింది.
శ్లో|| దుర్గమాసుర హంత్రీత్వాత్ దుర్గేతి మమ నామ యః | - శ్రీ దేవీ భాగవతం - 7 వ స్కంధం; శ్లో|| 79, అధ్యాయం 28.
"శ్రీ దేవ్యధర్వశీర్షం" దుర్గా నామం దురాచారాలను నాశనం చేస్తుందనీ, సంసార సాగరాన్ని దాటిస్తుందనీ, అంత తేలికగా ఆ తల్లి గూర్చి మనం తెలుసుకోలేమనీ అంటోంది. ఒక్కసారి అమ్మవారి చూపు మనపై పడీ పడడంతోటే మనకు భవభీతి ఉండదనీ, భవం కూడా మధురమేననీ ఆదిశంకరులు అంటారు. దుర్గాపూజ చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుతూ అమ్మవారిని ఎఱ్ఱని పూలతో పూజించిన వాడికి సకల దుఃఖాలు నశిస్తాయి.
శ్లో|| తాం దుర్గాం దుర్గమాం దేవీం, దురాచార విఘాతినీమ్ | నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీమ్||

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less