Dec 12 2025డిసెంబరు 12 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 12 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం

తిథి: అష్టమి రా.8.51 కు తదుపరి నవమి 13 రా.9.33 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పుబ్బ ఉ.8.32 కు తదుపరి ఉత్తర 13 ఉ.9.33 కు
యోగం: ప్రీతి ఉ.11.11కు తదుపరి ఆయుష్మాన్ 13 ఉ.11.16 కు
కరణం: కౌలవ మ.2.57 కు తదుపరి తైతుల తె.3.43 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.08:52-09:36 కు, మ.12:31-01:15 కు
వర్జ్యం: మ.3.55-5.33 కు
అమృతకాలం: ఉ.08:02-09:25 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు

🕉️ అనఘాష్టమి, కాలభైరవాష్టమి 🕉️

గురుబోధ:
🕉️కాలభైరవుడిని నల్లని పుష్పములతో లేక నీల పుష్పములతో కానీ పూజిస్తే భయంకర అపమృత్యు దోషాలు తొలగుతాయి. గ్రహాల యొక్క‌ అనుగ్రహం లభిస్తుంది. ఈ పర్వదినం నాడు కంద, బచ్చలి, దుంపలు, ఆకుకూరలు స్వయంపాకం ఒక అర్హత గల బ్రాహ్మణుడికి‌ కానీ, గురువుకి కానీ ఇవ్వాలి. ఇలా చేస్తే ఏనాడూ జీవితంలో భుక్తికి లోటు ఉండదు. వస్త్ర దానం చేస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
🕉️శ్లో ౹౹ విశ్వేశం మాధవం డుంఠిమ్ దండపాణిం చ భైరవమ్|
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం || - (కాశీఖండం)
కాశీక్షేత్రములోని ప్రధాన దేవతలందరినీ స్మరించుకునే ధ్యానశ్లోకము. ప్రతినిత్యం ఈ శ్లోకం తలచుకోవడం వల్ల దేవతల అనుగ్రహం కలిగి కాశీవాస ఫలితం లభిస్తుంది. శ్రీ కాలభైరవ అష్టకమును ప్రతిరోజూ పారాయణం చేయడం వల్ల తప్పక కాశీ నివాస ఫలితం కలుగుతుంది.

https://youtu.be/nCOJ1NFWpQQ?si=ZoHKOJigbcA12MlB

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less