కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 06 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ రా.2.42 కు తదుపరి తదియ 7 రా.12.45 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మృగశిర ఉ.11.58 కు తదుపరి ఆరుద్ర 7 ఉ.10.33 కు
యోగం: శుభ రా.11.45 కు తదుపరి శుక్ల 7 రా.8.07 కు
కరణం: తైతుల ఉ.11.08 కు తదుపరి గరజి రా.8.26 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.8.05-8.49 కు
వర్జ్యం: రా.7.52-9.22 కు
అమృతకాలం: రా.09:18-10:43 కు
సూర్యోదయం: ఉ. 6.15 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు
గురుబోధ:
సూర్యోదయం అయ్యాక కూడా నిద్రించే వారి ఇంటిలో తరచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. లక్ష్మీదేవి ఆ ఇంటిలో ఉండదని శాస్త్రం. వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి మినహాయింపు.
పూజ్య గురుదేవులు అభినవశుక, ప్రవచననిధి, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ సంపూర్ణ పద్మపురాణం ప్రవచనం ఇప్పటికే 4 భాగాలు విజయవంతంగా పూర్తయ్యాయి – 5వ భాగం (8 రోజులు)
🗓️ డిసెంబరు 7–14, 2025
🕕 సా. 6:00 – 8:00
వేదిక:📍 శ్రీ కృష్ణ దేవాలయం, యాదవనగర్ (అల్కాపురి క్రాస్ రోడ్స్),
నాగోల్ – స్వాగత్ హోటల్ ఎదురుగా, ఎల్‌బి నగర్, హైదరాబాద్
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial