Dec 04 2025డిసెంబరు 04 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 04 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్దశి ఉ.9.35 కు తదుపరి మార్గశిర పూర్ణిమ 5 ఉ.7.12 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: కృత్తిక మ.3.13 కు తదుపరి రోహిణి 5 మ.1.34 కు
యోగం: శివ మ.12.34 కు తదుపరి సిద్ధ 5 ఉ.8.08 కు
కరణం: వణిజ ఉ.8.38 కు తదుపరి విష్టి సా. 6:41 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:16-11:00 కు, మ.2.40-3.24 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ.12.48-2.12 కు
సూర్యోదయం: ఉ. 6.15 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు

🕉️ శ్రీ దత్తాత్రేయస్వామి జయంతి, మాణిక్ ప్రభు జయంతి, పద్మకయోగము🕉️

గురుబోధ:
🕉️మార్గశిర పూర్ణిమని (రాత్రికి పూర్ణిమ తిథి ఉండాలి) దత్త జయంతిగా జరుపుకుంటాము. త్రిమూర్తి అవతారం దత్తాత్రేయ అవతారం.
🕉️అత్రి పుత్రుడు కనుక ఆత్రేయుడు అని అన్నారు. దత్తాత్రేయుడు గొప్ప యోగి, అవధూత, సాక్షాత్తూ విష్ణు అవతారం కనుక భగవంతుడు. ఆత్మజ్ఞానాన్ని బోధించినవాడు కనుక గురువు. సాక్షాత్తూ ఆ ఆదిలక్ష్మి అనఘాదేవిగా, దత్తాత్రేయుడికి భార్యగా వచ్చింది. ఈ పుణ్యదినమున ఆ దత్తాత్రేయుడిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. తెలుపు, పసుపు, ఎరుపు రంగు పూవులతో పూజించాలి. దధ్యోదనం (పెరుగన్నం), బెల్లంతో చేసిన గుడాన్నం నైవేద్యంగా సమర్పించాలి. "ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః" అనే మంత్రాన్ని జపించుకోవాలి. అవకాశం ఉంటే ఆ రోజు రాత్రి 10గంటలకి వెన్నెలలో కూర్చుని ఈ మంత్రాన్ని జపించుకుంటే ఉత్తమం.
🕉️"దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం | బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహమ్" అనే శ్లోకాన్ని పఠించాలి.
🕉️దత్తాత్రేయుడు చాలా భక్త సులభుడు. ఆయనని నమ్మి భక్తితో నమస్కరించినా కూడా ప్రసన్నుడు అవుతాడు. నిజమైన భక్తులను ఆయన పరీక్షిస్తాడు. ఆ దత్తాత్రేయుడిని నమ్మి ఆ పరీక్ష తట్టుకుని నిలబడగలిగితే ఆయన ప్రసన్నుడు అయి ఎప్పటికీ రక్షిస్తుంటాడు.
🕉️దత్తాత్రేయుని 24 అవతారాలలో ముఖ్యమైనవి శ్రీ పాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి అవతారములు.

https://youtu.be/TN1O0jpvUSQ

https://youtu.be/qdC3yYU5PAg

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less