కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 02 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి మ.2.22 కు తదుపరి త్రయోదశి 3 మ.11.55 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: అశ్వని సా.6.39 కు తదుపరి భరణి 3 సా.4.52 కు
యోగం: వరీయాన్ 2 రా.8.08 కు తదుపరి పరిఘ 3 సా.4.57 కు
కరణం: బాలవ మ.3.57 కు తదుపరి కౌలవ రా.2:14 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:47-9:31 కు, రా.10:47-11:39 కు
వర్జ్యం: మ.2.52-4.22 కు & రా.3.32-5.02 కు
అమృతకాలం: మ.2:23-3:49 కు
సూర్యోదయం: ఉ. 6.15 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు
🕉️ ప్రదోషము, భౌమాశ్వినీయోగము , హనుమద్వ్రతం(కన్నడ)🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ ఈరోజు చెయ్యాలి.
గురుబోధ:
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం శివాశివుల ఐక్యరూపం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial