కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 23 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం
తిథి: తదియ సా.6.46 కు తదుపరి చతుర్థి 24 రా.8.08 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: మూల సా.5.46 కు తదుపరి పూర్వాషాఢ 24 రా.7.40 కు
యోగం: ధృతి సా.12:08 కు తదుపరి శూల 24 సా.12:36 కు
కరణం: గరజి రా.7.25 కు తదుపరి వణిజ 24 ఉ. 8:26 కు
రాహుకాలం: సా. 4.30 - 6.00 కు
దుర్ముహూర్తం: సా.4:06-4:51 కు
వర్జ్యం: సా.4.01-5.45కు, తె.4.08-5.50 కు
అమృతకాలం: రా.12:26 - 02:13 కు
సూర్యోదయం: ఉ. 6:12 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు
🕉️ శ్రీ సత్యసాయి జన్మదినోత్సవం 🕉️
గురుబోధ:
🕉️శ్రీ సత్యసాయి భగవదవతారం. మహాత్ములను, పీఠాధిపతులను, భక్తులను నిందిస్తే వెయ్యి జన్మలలో చేసిన అఖండ పుణ్యఫలితం కోల్పోతాము. భ్రష్టులై వంశంలో అకాల మరణాలు, తెలియని వింత రోగాలతో కుటుంబము అంతా సతమతం అవుతుందని శాస్త్రం.
🕉️నిత్యం ఆలయాలను దర్శించడం, మహాత్ములు, సద్గురువుల ఆశీస్సులు పొందడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కష్టాలు తొలగుతాయి.
🕉️మహాత్ములను హింసిస్తే అన్నీ నశించిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో మన వాక్కుతో కూడా మహాత్ముల మనస్సుకు గాయం కాకుండా చూసుకోవాలి. వాళ్ళ మనసు కష్టపెడితే, వంశాలు నాశనమైపోతాయని వేదవాక్కు.మాటతో కానీ చేతతో కానీ ఎవరినీ కూడా కష్టపెట్టకుండా బాధపెట్టకుండా ఉండాలి. అందులోనూ ధర్మం మీద నిలబడే వారిని అస్సలు ఏ విధమైన బాధకు గురి చేయకూడదు. వారు కానీ వారి కుటుంబంలో స్త్రీలుగాని బాధపడి కంట కన్నీరు పెడితే అది లోకానికి శ్రేయస్కరము కాదు. "ఆర్య హింస చేయనడవు కాదే" అని భాగవతం చెప్పింది, అందుకనే పవిత్రంగా జీవితాన్ని గడుపుతున్న వారిని ఎట్టి పరిస్థితులలోనూ బాధపెట్టకూడదు. సాధ్యమైనంత వరకు ఏ ఇతర జీవిని కూడా బాధపెట్టకుండా ఉండాలి.