కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 20 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం
తిథి: కార్తిక అమావాస్య మ.12.25 కు తదుపరి మార్గశిర శుద్ధ పాడ్యమి 21 మ.2.55 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: విశాఖ ఉ.10.25 కు తదుపరి అనూరాధ 21 మ.1.00 కు
యోగం: శోభన ఉ.8:52 కు తదుపరి అతిగండ 21 ఉ.10:43 కు
కరణం: నాగ మ.12.17 కు తదుపరి కింస్తుఘ్న రా.02:15 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:10-10:54 కు, మ. 2:37-3:22 కు
వర్జ్యం: మ.2.53-4.39 కు
అమృతకాలం: రా.02:15-04:02 కు
సూర్యోదయం: ఉ. 6:24 కు
సూర్యాస్తమయం: సా. 5:40 కు
🕉️ కార్తిక అమావాస్య, అమావిశాఖా & అమానూరాధా యోగము, పద్మక యోగము🕉️
గురుబోధ:
సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. రాత్రి లేక ప్రదోషంతో కూడిన చతుర్దశి, చతుర్దశి తరువాత తిథి (పూర్ణిమ లేక అమావాస్య) శివదర్శనమునకు శ్రేష్ఠకాలములు. పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
శ్రీ శివకేశవ అష్టోత్తరం:
https://youtu.be/1MoC79bhXT0?si=_hZLf1eEtz9krh4n
పితృదేవతా స్తోత్రం:
https://youtu.be/UgnxFM4YHYY?si=542fuGmCahDfoin9