Nov 14 2025నవంబరు 14 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 14 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం

తిథి: దశమి 15 తె.5.26 కు తదుపరి ఏకాదశి 16 తె.6.02 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పుబ్బ రా.12.49 కు తదుపరి ఉత్తర 15 రా.1.52 కు
యోగం: ఐంద్ర ఉ.6:27 కు తదుపరి వైధృతి 15 ఉ.6:25 కు
కరణం: వణిజ ప. 12.07 కు తదుపరి విష్టి రా.12.30 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:38-9:23 కు, మ. 12:22-1:07 కు
వర్జ్యం: ఉ.8.26-10.04 కు
అమృతకాలం: మ.2.29-4.12 కు
సూర్యోదయం: ఉ. 6:22 కు
సూర్యాస్తమయం: సా. 5:37 కు

గురుబోధ:
కార్తిక మాసంలో శ్రీమన్నారాయణుడ్ని పూజించి, ధాత్రీ (ఉసిరి) వృక్షం ఉన్నచోట చూసుకుని వనభోజనం చేయాలని శాస్త్రం. వనభోజనముకు సంప్రదాయ వంటలు మాత్రమే తీసుకెళ్లాలి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less