కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 20 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్దశి మ.1.37 కు తదుపరి ఆశ్వయుజ అమావాస్య 21 సా.4.03 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: హస్త రా.8.15 కు తదుపరి చిత్త 21 రా.10.18 కు
యోగం: వైధృతి 21 రా.3:26 కు తదుపరి విష్కంభ 22 తె.3:16 కు
కరణం: శకుని మ.1.52 కు తదుపరి చతుష్పాద మ.1.52 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: 12:23-1:10 కు, మ. 2:42-3:28 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ.1.40-3.25 కు
సూర్యోదయం: ఉ. 5:56 కు
సూర్యాస్తమయం: సా. 5:34 కు
🕉️ నరకచతుర్దశి, దీపావళి 🕉️
గురుబోధ:
🕉️ 2025 అక్టోబరు 20 వ తేదీ, చతుర్దశీ తిథి, సోమవారం
చతుర్దశి నాడు శివపురాణం విన్నవారు శివుడ్ని అభిషేకించి, శివాలయంలో ప్రదక్షిణలు చేసి యథాశక్తి రాత్రికి జాగరణ చేసినవారు కురుక్షేత్రంలో యజ్ఞం చేసి, తనంత బరువున్న బంగారాన్ని సూర్యగ్రహణం నాడు దానం చేసిన వారికి వచ్చే ఫలితం వస్తుంది - శ్రీ శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత
దీపావళీ అమావాస్య నాడు ఆచరించవలసిన ముఖ్య విధివిధానాలు:
🕉️సూర్యోదయమునకు ముందే తప్పక అభ్యంగన స్నానం ఆచరించాలి.
🕉️దీపములు వెలిగించాలి. బ్రహ్మ దేవుడు అమ్మవారిని లోకశ్రేయస్సుకోసం ప్రార్థించగా, ఏ ఇళ్ళలో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో, ఆ ఇళ్ళు సమృద్ధిగా ఆయురారోగ్యాలతో ఉంటాయని అమ్మవారు వరం ఇచ్చింది.
🕉️దీపావళి రోజు అమ్మవారిని వీలయితే తామర పువ్వులు, ఎఱ్ఱకలువ పూలతో పూజించాలి.
🕉️ఈరోజు అమ్మవారిని మనస్పూర్తిగా అష్టోత్తరంతో, సహస్రనామాలతో లేదా శ్రీసూక్తంతో కుంకుమ పూజ చేయాలి.
🕉️అమ్మవారికి పూజలో ఈ రోజు మన దగ్గర ఉన్న ఆభరణాలు సమర్పించాలి.
🕉️పులిహోర, దధ్యన్నం, పాయసాన్నం ఈ రోజు అమ్మకి నైవేద్యంగా సమర్పించాలి.
🕉️అమ్మవారికి ఈ రోజు నాలుగు ప్రదక్షిణలు చేయాలి.
🕉️దేవాలయంలో వీలయినన్ని ప్రదక్షిణలు చేయడం ముఖ్యంగా నవగ్రహాలకు 108 ప్రదక్షిణలు చేయడం మంచిది.
🕉️సాయంత్రం వేళ గుమ్మం దగ్గర నువ్వుల నూనెతో మాత్రమే దీపం వెలిగించాలి.
గోంగూర కాడలు నూనెలో నానబెట్టి, కాడకి వత్తి కట్టుకుని దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి అని అంటూ కింద కొట్టాలి. ఇలా చేస్తే వాస్తు దోషాలు, దృష్టి దోషాలు పోతాయి
🕉️రాత్రి తిరిగి ఇంటి గుమ్మం దగ్గర హారతి వెలిగించి, కళ్ళకు అద్దుకుని గుమ్మం బయట పారవేసి, కళ్ళు, కాళ్ళు కడుక్కోవాలి.
🕉️దీపావళి నాడు స్వయంపాకం దానం చేసేవాళ్ళు పితృదేవతల యెుక్క అనుగ్రహం పొందుతారు.
శ్రీ వ్యూహలక్ష్మీ మంత్రం 1000 సార్లు👇
https://youtu.be/VkqlChh3XRw?si=Zh7x8dcyaso1kP_l
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం👇
https://youtu.be/FNh6oGn-k8w
ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం👇
https://youtu.be/if5zzw20GaQ
అగస్త్యకృత మహాలక్ష్మీస్తోత్రం👇
https://youtu.be/yUXkM_QhZgA?si=h2r-b5AvxyZIfrJ7
శ్రీ వ్యూహలక్ష్మీదేవి మంత్ర వైశిష్ట్యం👇
https://youtu.be/JGt7-hnqUHI?si=1e7mSCeG115aKNmM