కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 30 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: అష్టమి మ.3.29 కు తదుపరి ఆశ్వయుజ శుద్ధ నవమి 1 సా.4.20 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పూర్వాషాఢ 1 తె.5.00 కు తదుపరి ఉత్తరాషాఢ 1 పూర్తి
యోగం: శోభన రా.1:02 కు తదుపరి అతిగండ 1 రా.12:33 కు
కరణం: బవ సా.6.06 కు తదుపరి బాలవ 1 ఉ.06:39 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:32-9:19 కు, ఉ. 10:53-11:41 కు
వర్జ్యం: మ.1.31-3.13 కు
అమృతకాలం: రా.2.56-4.39 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు
🕉️ శరన్నవరాత్రులు 9వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి) అలంకారం 🕉️
గురుబోధ:
🕉️ఈ రోజు అమ్మవారు దుర్గముడను రాక్షసుని వధించిన ఘట్టం పారాయణ చేసినా మఱియు శ్రవణం చేసినా విశేష ఫలితం వస్తుంది.
🕉️శ్రీ దుర్గాష్టోత్తర శతనామపారాయణం వలన అష్టకష్టాల్లో నుండి బయటపడతారు, అష్టైశ్వర్యాలను పొందుతారు, దీనిని నిరంతరం పారాయణం చేస్తే ఆత్మబలం, జ్ఞానం పెరుగుతాయి, పనులు చెయ్యడానికి కావలసిన శక్తి లభిస్తుంది, ఈ నామాలను శుచిగా ఉండి భక్తిశ్రద్ధలతో ఎప్పుడైనా పారాయణం చేసుకోవచ్చు. కానీ, అష్టమి, నవమి, చతుర్దశి అనే మూడు తిథులూ అమ్మవారికి చాలా ఇష్టం. అటువంటి పవిత్రకాలాల్లో చేస్తే తిరుగులేని అద్భుతఫలితం లభిస్తుంది.
• శ్రీ మద్దేవీభాగవత గ్రంథములో 12 స్కంధములు మొత్తం పారాయణము చేయలేని, వారు కనీసం 9వ స్కంధం అయినా పారాయణము చేసుకోవచ్చు, అది సకల పుణ్యప్రదం, సర్వ శుభదాయకం.
శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళి👇
https://youtu.be/GNNNIDBcOV0?si=fAIhnz7bm3sqdYbY
శ్రీ అర్జునకృత దుర్గా స్తోత్రం👇
https://youtu.be/Q3qrCTG6-3w?si=pM9PCs77wVgi2iGi