Sep 25 2025సెప్టెంబరు 25 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 25 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్థి 26 ఉ.8.05 కు తదుపరి పంచమి 27 ఉ.10.28 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: స్వాతి సా.5.34 కు తదుపరి విశాఖ 26 రా.8.12 కు
యోగం: వైధృతి రా.8:53 కు తదుపరి విష్కంభ 26 రా.10:50 కు
కరణం: గరజి ఉ.7.06 కు తదుపరి వణిజ రా.8.19 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:08-10:56 కు, మ. 2:55-3:42 కు
వర్జ్యం: రా.11.47-1.33 కు
అమృతకాలం: ఉ.9.17-11.05 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ శరన్నవరాత్రులు 4వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ లలితాదేవి అలంకారం 🕉️

గురుబోధ:
శ్రీ దేవీకవచం చదివి ఎక్కడికి వెళ్ళినా విజయం తప్ప అపజయం ఉండదు. ఉద్యోగం కావాలని ఈ కవచం చదివి ఆ ఉద్యోగ ప్రయత్నం చెయ్యండి, క్షణాలలో వస్తుంది. సంపద కావాలని శ్రద్ధతో వినండి, చదవండి, సంపదలు వస్తాయి. మాకు కీర్తి కావాలి, పదిమంది చేత ప్రశంసింపబడాలి అని ఈ కవచం చదవండి, మీకు ప్రశంసలు లభిస్తాయి. ఒకటి కాదు, సకల శుభాలూ కలిగిస్తుంది. భయంకర రోగాలు వచ్చినప్పుడు ఈ కవచమును పఠిస్తే ఆ వ్యాధులన్నీ తత్ క్షణం నశించిపోతాయి. మన మీద ఎవరైనా ప్రయోగాలు, చేతబడులు చేసినా ఆ ప్రయోగాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ భూమండలంలో ఇంత అత్యద్భుతమైన కవచం చాలా అరుదుగా ఉంటుంది, అని త్రిమూర్తులు చెప్పారు. అటువంటి ఈ గొప్ప కవచాన్ని పారాయణము చేసుకోండి లేదా వినండి, రెండిటి ఫలితమూ ఒకటే. శ్రీ దుర్గాసప్తశతి పారాయణం చేసేవారు, ఈ కవచం విన్న తరువాత లేదా పారాయణం చేసిన తరువాత సప్తశతిని పారాయణ చేస్తే మరింత శక్తివంతులవుతారు, అమ్మ అనుగ్రహం తొందరగా లభిస్తుంది.

శ్రీ దేవీకవచం👇
https://youtu.be/L6x2WCTl27o?si=G08HyIaccCidnVnH

శ్రీ లలితాత్రిశతీ స్తోత్రం👇
https://youtu.be/FS-o_aSJRd0?si=kzqkv-GrS3Jlnqzk

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less