Sep 17 2025సెప్టెంబరు 17 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 17 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి రా.3.16 కు తదుపరి ద్వాదశి 18 రా.2.06 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పునర్వసు ఉ.9.43 కు తదుపరి పుష్యమి 18 ఉ.8.59 కు
యోగం: పరిఘ రా.10:54 కు తదుపరి శివ 18 రా.8:37 కు
కరణం: బవ ఉ.11.57 కు తదుపరి బాలవ రా.11.40 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:46-12:34 కు
వర్జ్యం: సా.5.29-7.02 కు
అమృతకాలం: రా.12:06-1:43 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ భాద్రపద కృష్ణ ఏకాదశి,'అజ' ఏకాదశి (జన్మరాహిత్యం కలిగించేది), విశ్వకర్మ జయంతి, కన్యాసంక్రమణం 🕉️
🕉️ మహాలయపక్షాలు (పితృపక్షములు), 10వ దినము 🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చేయాలి.

గురుబోధ:
'అజ' ఏకాదశి " - భాద్రపదమాసంలో వచ్చే కృష్ణ పక్షంలో ఏకాదశికి 'అజ' ఏకాదశి అని పేరు. జన్మరాహిత్యం కలిగించేది. ఈ ఏకాదశీ వ్రతం శ్రద్ధాసక్తులుతో ఆచరిస్తే, ఆ వ్యక్తికి జీవితంలో కష్టములు రావు. జీవితంలో ఏ విధమైన అశాంతి ఉండదు. ప్రశాంతత లభిస్తుంది.

శ్రాద్ధ భోజనానికి వేటితో వండితే పితృదేవతలు మరింత సంతోషిస్తారు ? స్వయంపాకమునకు (కూరగాయలు, వంట సామగ్రి మొ౹౹) ఏవేవి దానం చేస్తే మంచిది? పితృదేవతలకి ఆవపిండితో చేసిన వంటలు, నువ్వులుతో వంటలు, గోధుమలతో చేసిన అప్పాలు, పెసర, మినపపప్పుతో వంటలు వండడం లేదా ఇవి దానాలు చేయడం వల్ల పితృదేవతలు తృప్తి పడతారు. స్వయంపాకమునకు కందగడ్డ, చామగడ్డ, తోటకూర, బెల్లం, చింతపండు, బెండ, కాకర, పనసకూర,  ఎండుమిరప, ఆవాలు, ఆవు నెయ్యి, పంచకదళి (అరటికాయ, అరటిపండు, అరటిపువ్వు, అరటి దూట, అరటి ఆకు), పాలు, పెరుగు, నల్ల మినపపప్పు,పెసరపప్పు, అల్లం, చెరకు రసం మొదలైనవి.

పంచకదళీ దానం
కదళీ (అరటి) - పితృదేవతల ప్రీత్యర్థం స్వయంపాకం ఇచ్చేప్పుడు పంచకదళీ అంటే అరటి ఆకు, అరటి కాయ, అరటి పండు, అరటి పువ్వు, అరటి దూట ను ఇవ్వడం లేదా వీటిని పితృ కార్యక్రమంలో వంటకు వినియోగించడం చాలా మంచిది.

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less