Sep 15 2025సెప్టెంబరు 15 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 15 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: అష్టమి ఉ.8.21 కు తదుపరి నవమి 16 ఉ.6.19 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: మృగశిర ఉ.11.45 కు తదుపరి ఆరుద్ర 16 ఉ.10.33 కు
యోగం: వ్యతీపాత రా.2:34 కు తదుపరి వరీయాన్ 16 రా.12:33 కు
కరణం: తైతుల మ.2.16 కు తదుపరి గరజి రా.1.31 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:35-1:23 కు, మ. 3:00-3:49 కు
వర్జ్యం: రా.7.43-9.13 కు
అమృతకాలం: రా.9:05-10:38 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ వ్యతీపాతమహాలయం, అవిధవానవమి, అన్వాష్టకము, మహాలయపక్షాలు (పితృపక్షములు), 8వ దినము 🕉️

గురుబోధ:
సదాచారాలను పాటించేవారు దేవతలకు, పితృదేవతలకు ప్రీతిపాత్రులు అవుతారు. అశౌచకాలంలో సరైన నియమాలను పాటించకపోతే దేవతలు మరియు పితృదేవతల అనుగ్రహము పొందలేము. ఉదా౹౹ మృతాశౌచం ఉన్న రోజులలో ( 10, 12 లేదా 15 రోజులు) లేదా స్త్రీలు బయట ఉన్న 3 రోజులు అగ్నిని తాకడం, దేవతా మూర్తులను, ఇంటిలో అన్ని వస్తువులను తాకడం, వంట చేయడం, అందరినీ కలుపుకోవడం చేయరాదు. ఇటువంటి తప్పులు చేసి ఎన్ని ప్రదక్షిణలు, జపాలు, హోమాలు, దానధర్మాలు చేసినా దేవతల అనుగ్రహం కలుగదు. అందుకే సాధ్యమైనంత వరకు ఆచారములు పాటించాలి. అవే మన పిల్లలని, భవిష్యత్ తరాలని కాపాడుతాయి.

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw

expand_less