కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 09 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ రా.10.14 కు తదుపరి తదియ 10 రా.8.11 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.9.05 కు తదుపరి రేవతి 10 రా.7.44 కు
యోగం: గండ రా.11:58 కు తదుపరి వృద్ధి రా.8:31 కు
కరణం: తైతుల ఉ.09:07 కు తదుపరి గరజి సా.6.29 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:33-9:22 కు, ఉ.11:02-11:49 కు
వర్జ్యం: ఉ.7.23-8.54 కు
అమృతకాలం: మ.1:42-03:10 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు
🕉️ మహాలయ పక్షారంభము (పితృపక్షములు), 2వ రోజు 🕉️
గురుబోధ:
👉భాద్రపదమాసం లో పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి మొదలుకుని అమావాస్య వరకు ఉండే 15 రోజులను మహాలయపక్షము లేదా పితృ పక్షం అంటారు ఈ 15 రోజులలో చనిపోయిన వారి తిథిని బట్టి శ్రాద్ధం నిర్వహిస్తే అది గయాశ్రాద్ధంతో సమానము.
👉ఒకే ఇంటి పేరు ఉన్న వారిని భోక్తగా పిలువరాదు. సగోత్రీకులని పిలువవచ్చు. ఒక్క యోగి లేదా పురాణజ్ఞుడు, పండితుడు భోక్తగా వస్తే అక్షయ ఫలితం వస్తుంది.