కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 08 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: భాద్రపద బహుళ పాడ్యమి రా.12.11 కు తదుపరి విదియ 9 రా.10.14 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర రా.10.11 కు తదుపరి ఉత్తరాభాద్ర 9 రా.9.05 కు
యోగం: ధృతి ఉ.6:29 కు తదుపరి గండ సా.11:58 కు
కరణం: బాలవ ఉ.10:28 కు తదుపరి కౌలవ రా.8.12 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: 12:38-1:27 కు, మ. 3:04-3:53 కు
వర్జ్యం: ఉ.5.10-6.43 కు
అమృతకాలం: మ.12:35-02:04 కు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:13 కు
🕉️ మహాలయ పక్షారంభము (పితృపక్షములు), 🕉️
గురుబోధ:
✒️గ్రహణం విడిచిన తరవాత విడుపు స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఆలయాల్లో ప్రదక్షిణ, ఆలయం శుభ్రం చేయడం వల్ల భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. గ్రహణ దోషముల కు గోసేవ, గురు సేవ, బ్రాహ్మణలకు తగిన ధనం దానం చేయడం మంచిది.
✒️భాద్రపదమాసం లో పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి మొదలుకుని అమావాస్య వరకు ఉండే 15 రోజులను మహాలయపక్షము లేదా పితృ పక్షం అంటారు ఈ 15 రోజులలో చనిపోయిన వారి తిథిని బట్టి శ్రాద్ధం నిర్వహిస్తే అది గయాశ్రాద్ధంతో సమానము.
https://youtu.be/2XIMubl8kGY?si=KiVdgrseHrTMW5Wc