కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 30 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: సప్తమి రా.9.46 కు తదుపరి అష్టమి 31 రా.11.41 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: విశాఖ మ.1.07 కు తదుపరి అనూరాధ 31 మ.3.39 కు
యోగం: ఐంద్ర మ.3:09 కు తదుపరి వైధృతి 31 మ.3:58 కు
కరణం: గరజి ఉ.8.35 కు తదుపరి వణిజ రా.10.47 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:44-8:34 కు
వర్జ్యం: సా.5.32-7.18 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:17 కు
గురుబోధ:
పితృపక్షం భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న 15 తిథులను పితృపక్షం అంటారు. ఈ 15 రోజులలో చనిపోయిన వారి తిథిని బట్టి శ్రాద్ధం నిర్వహిస్తే అది గయాశ్రాద్ధం తో సమానం అవుతుంది.