కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 25 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: విదియ మ.1.34 కు తదుపరి తదియ 26 మ.2.42 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఉత్తర రా.3.48 కు తదుపరి హస్త 27 తె.5.50 కు
యోగం: సిద్ధ మ.12:05 కు తదుపరి సాధ్య 26 మ.12:08 కు
కరణం: కౌలవ మ.12.35 కు తదుపరి తైతుల రా.1.11 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:43-1:32 కు, మ. 3:12-4:02 కు
వర్జ్యం: ఉ.10.01-11.42 కు
అమృతకాలం: రా.8:06-9:49 కు
సూర్యోదయం: ఉ. 5:47 కు
సూర్యాస్తమయం: సా. 6:20 కు
గురుబోధ:
శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇
https://youtu.be/tOm3F2CXUOg?si=CwlbQLD31KoTbefw
ఈ స్తోత్రం భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది. ప్రతి శుక్లపక్ష చతుర్థినాడు ఈ స్తోత్రాన్ని విన్నవారికి సంపదలు లభిస్తాయి. ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి. గణేశాలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈ స్తోత్రం వింటే, భూప్రదక్షిణ చేసిన ఫలితం. భయంకరమైన జాతకదోషాలు తొలగించి, విదేశీయానం కావాలనుకొన్నవారికి లభించేలా చేస్తుంది.
శాస్త్రప్రకారం వినాయకుని పూజకు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎటువంటి సందర్భంలోనూ తులసీదళాలు ఉపయోగించరాదు. "శ్రీ శివపురాణం"లో తులసీదళానికి బదులుగా "శిరీషదళము" అని ఉన్నది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.