Aug 17 2025ఆగష్టు 17 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 17 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి రా.10.08 కు తదుపరి దశమి 18 రా.7.52 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: కృత్తిక ఉ.6.45 తదుపరి రోహిణి 18 తె.5.07 కు
యోగం: వ్యాఘాత రా.1:40 కు తదుపరి హర్షణ 18 సా.10:59 కు
కరణం: తైతుల ఉ.8.29 కు తదుపరి గరజి రా.7.24 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:56-5:46 కు
వర్జ్యం: రా.9.39-11.09 కు
అమృతకాలం: రా.12.16-01.46 కు
సూర్యోదయం: ఉ. 5:44 కు
సూర్యాస్తమయం: సా. 6:28 కు

🕉️ సింహ సంక్రమణం🕉️
పుణ్యకాలం: ఉ.5.58-12.26 కు
మహాపుణ్యకాలం: ఉ.5.58-8.07 కు

గురుబోధ:
మహాత్ములను హింసిస్తే అన్నీ నశించిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో మన వాక్కుతో కూడా మహాత్ముల మనస్సుకు గాయం కాకుండా చూసుకోవాలి. వాళ్ళ మనసు కష్టపెడితే, వంశాలు నాశనమైపోతాయని వేదవాక్కు.మాటతో కానీ చేతతో కానీ ఎవరినీ కూడా కష్టపెట్టకుండా బాధపెట్టకుండా ఉండాలి. అందులోనూ ధర్మం మీద నిలబడే వారిని అస్సలు ఏ విధమైన బాధకు గురి చేయకూడదు. వారు కానీ వారి కుటుంబంలో స్త్రీలుగాని బాధపడి కంట కన్నీరు పెడితే అది లోకానికి శ్రేయస్కరము కాదు. "ఆర్య హింస చేయనడవు కాదే" అని భాగవతం చెప్పింది, అందుకనే పవిత్రంగా జీవితాన్ని గడుపుతున్న వారిని ఎట్టి పరిస్థితులలోనూ బాధపెట్టకూడదు. సాధ్యమైనంత వరకు ఏ ఇతర జీవిని కూడా బాధపెట్టకుండా ఉండాలి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less