July 27 2025జులై 27 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 27 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: తదియ రా.11.54 కు తదుపరి చతుర్థి 28 రా.1.01 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: మఖ సా.5.56 కు తదుపరి పుబ్బ 28 రా.6.57 కు
యోగం: వరీయాన్ 28 తె.3:13 కు తదుపరి పరిఘ 29 రా.2:53 కు
కరణం: తైతుల ప.10.37 కు తదుపరి గరజి రా.10.42 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.5:04-5:55 కు
వర్జ్యం: ఉ.5.42-7.20 కు & రా.2.17-3.56 కు
అమృతకాలం: మ.1.56-3.34 కు
సూర్యోదయం: ఉ. 5:40 కు
సూర్యాస్తమయం: సా. 6:32 కు

గురుబోధ:
పురాణములు వినడానికి ఎటువంటి నియమం లేదు. శ్రద్ధ, భక్తి ఉంటే చాలు. తింటూ, పనిచేస్తూ, భోజనం చేస్తూ, ప్రయాణం చేస్తూ కూడా వినవచ్చు. ఇంతకంటే తరించే సులభోపాయం మరొకటి లేదు. పురాణ గ్రంథములను భక్తితో పూజించినా ఆ పురాణ అధిష్ఠానదేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. కలియుగంలో తరించడానికి పురాణ శ్రవణమునకు మించిన ధర్మం, పుణ్యం లేదని సకల శాస్త్రాలు చెపుతున్నాయి. పరీక్షిత్, శ్రీ శుకుడు, వ్యాసుడు, సూతుడు, నారదుడు, మరెందరో ఋషులు, భక్తులు సద్గురువుల ద్వారా పురాణమును విని తరించారు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less