కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 13 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: తదియ రా.2.53 కు తదుపరి చతుర్థి 14 రా.1.40 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: శ్రవణం ఉ.7.41 కు తదుపరి ధనిష్ఠ 14 ఉ.7.35 కు
యోగం: ప్రీతి సా.6:00 కు తదుపరి ఆయుష్మాన్ 14 సా.4:13 కు
కరణం: వణిజ మ.1.27 కు తదుపరి విష్టి రా.1.03 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.5:06-5:58 కు
వర్జ్యం: ఉ.11.41-1.15 కు
అమృతకాలం: రా.08:26 - 10:02 కు
సూర్యోదయం: ఉ. 5:35 కు
సూర్యాస్తమయం: సా. 6:35 కు
🕉️💐🍆🍅🍊🎋 త్రిమాతృశక్తిధామం ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శాకంభరిగా అమ్మవారికి అలంకారం🕉️💐🍆🍅🍊🎋
గురుబోధ:
ప్రతిరోజూ ఏదో ఒక మంచి పనిచేయకుండా సమయాన్ని వ్యర్థంగా వెళ్లబుచ్చరాదు, నిద్రించరాదు. అంటే మంచి పుస్తకాలు, పురాణములు చదవడం, పారాయణం చేయడం, జపం చేయడం, ఆలయమునకు వెళ్లడం, ఇతరులకు సహాయం చేయడం, అన్నదానం, మంచి విషయాలు చర్చించడము, పెద్దలకు సేవ చేయడం మొ౹౹ ఏవో ఒకటి చేయాలి.