కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 09 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్దశి రా.3.02 కు తదుపరి ఆషాఢ పూర్ణిమ 10 రా.3.48 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: మూల 10 తె.5.13 కు తదుపరి పూర్వాషాఢ 10 పూర్తి
యోగం: బ్రహ్మ సా.10:08 కు తదుపరి ఐంద్ర 10 సా.8:37 కు
కరణం: గరజి మ.1.11 కు తదుపరి వణిజ రా.1.37 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:55-12:47 కు
వర్జ్యం: మ.11.59-1.41, రా.3.30-5.12 కు
అమృతకాలం: రా.10:05 - 11:47 కు
సూర్యోదయం: ఉ. 5:35 కు
సూర్యాస్తమయం: సా. 6:35 కు
గురుబోధ:
భూమి మీద పుట్టిన ప్రతిజీవికి కొన్ని ధర్మములు ఉన్నాయి. అందులో ఒకటి గురువును ఆశ్రయించడం. పుడమిలో మనుజులెవ్వరైనా గాని గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకిస్తే తప్ప తరించలేరు. అందుకే రాముడు, కృష్ణుడు సమస్తము ఎరిగిన వారయినప్పటికినీ, జగద్గురువులయినప్పటికినీ, పరిపూర్ణులయినప్పటికినీ గురువును ఆశ్రయించారు. ఈ జన్మల పరంపర నుండి విముక్తి పొందాలి అంటే సంపూర్ణంగా గురువు యొక్క శరణాగతిని పొందాలి. మోక్షాన్ని పొందడం అంత సులభము కాదు కానీ ఎవరైతే గురువుని, భగవంతుడిని సంపూర్ణ శరణాగతి వేడుకుంటారో వారికి మార్గం అత్యంత సులభం అవుతుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial