July 08 2025జులై 08 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 08 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి రా.1.50 కు తదుపరి చతుర్దశి 9 రా.3.02 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: జ్యేష్ఠ రా.3.23 కు తదుపరి మూల 10 తె.5.13 కు
యోగం: శుక్ల సా.10:16 కు తదుపరి బ్రహ్మ 9 రా.10:08 కు
కరణం: కౌలవ ఉ.11.58 కు తదుపరి తైతుల రా.12.38 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:27-9:19 కు, మ. 11:15-11:59 కు
వర్జ్యం: ఉ.7.14-9.00 కు
అమృతకాలం: సా.05:41 - 07:26 కు
సూర్యోదయం: ఉ. 5:35 కు
సూర్యాస్తమయం: సా. 6:35 కు

🕉️ మహాప్రదోషం🕉️

గురుబోధ:
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less