July 11 2025జులై 11 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 11 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: ఆషాఢ బహుళ పాడ్యమి తె.4.00 కు తదుపరి విదియ 12 తె.3.37 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.6.29 కు తదుపరి ఉత్తరాషాఢ 12 ఉ.7.20 కు
యోగం: వైధృతి సా.8:44 కు తదుపరి విష్కంభ 12 సా.7:31 కు
కరణం: బాలవ మ.2.11 కు తదుపరి కౌలవ రా.2.08 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:28-9:20 కు, మ. 12:47-1:39 కు
వర్జ్యం: మ.2.46-4.25 కు
అమృతకాలం: రా.12:01 - 01:40 కు
సూర్యోదయం: ఉ. 5:35 కు
సూర్యాస్తమయం: సా. 6:35 కు

🕉️ ఆషాఢ శుక్రవారము 🕉️

గురుబోధ:
సంమార్జనం చ కుర్వన్తి నరాయే చ శివాలయే |
తే వై శివపురం ప్రాప్య జగద్వంద్యాః భవన్తి చ ||
(స్కాంద పురాణం, మాహేశ్వర ఖండం, అ.5, శ్లో.49)
శివాలయానికి లేదా ఏదైనా ఆలయానికి వెళ్ళి భక్తిశ్రద్ధలతో కనీసం ఒక 40 రోజులు ఆలయాన్ని తుడిస్తే, తప్పక అంత్యకాలంలో కైలాసానికి లేదా భగవత్ సన్నిధానానికి వెళ్తారు. బతికి ఉన్నంతకాలం మహా ఐశ్వర్యవంతులై, వారి జాతకదోషాలన్నీ తొలగి, పదవులు, సంపదలతో పాటు కీర్తి లభిస్తుంది. వారి పూర్వకర్మల వల్ల బ్రహ్మదేవుడు వ్రాసిన పాతరాత తొలగి మంచిరోజులు, అనేక శుభఫలితాలు వస్తాయి.

expand_less