కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 23 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి రా.10.26 కు తదుపరి చతుర్దశి 24 రా.8.09 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: కృత్తిక మ.2.16 కు తదుపరి రోహిణి 24 మ.12.45 కు
యోగం: ధృతి సా.1:17 కు తదుపరి శూల 24 ఉ.8:35 కు
కరణం: గరజి ప.11.46 కు తదుపరి వణిజ రా. 10.10 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:44-1:36 కు, మ.3:20-4:12 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ.01.06-02.33 కు
సూర్యోదయం: ఉ. 5:30కు
సూర్యాస్తమయం: సా. 6:32 కు
🕉️ ప్రదోషం 🕉️
గురుబోధ:
🕉️శివాలయంలో శివలింగం బయట కాని, ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం.
🕉️ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు.