June 04 2025జూన్ 04 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 04 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం

తిథి: నవమి రా.3.23 కు తదుపరి దశమి 6 తె.4.57 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఉత్తర 5 తె.5.22 కు తదుపరి హస్త 5 పూర్తి
యోగం: వజ్ర ఉ.8:28 కు తదుపరి సిద్ధ 5 ఉ.8:13 కు
కరణం: బాలవ ఉ. 10.51 కు తదుపరి కౌలవ రా.11.54 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:48-12:40 కు
వర్జ్యం: ఉ.11.21-1.03 కు
అమృతకాలం: రా. 07.36 - 09.23 కు
సూర్యోదయం: ఉ. 5:28 కు
సూర్యాస్తమయం: సా. 6:27 కు

గురుబోధ:
ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క దేవతాశక్తి ఉంటుంది. ఈ సృష్టిలో మొత్తము 7 కోట్ల రకాల వృక్షజాతులు, 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రములన్నియు స్వర ప్రధానములు. ఉచ్చారణ, అక్షరదోషాలు లేకుండా చెయ్యాలి. భూలోకంలో ఉన్న మానవుల యొక్క ముఖ యంత్రములలోని లోపాల వల్ల కొంతమంది మంత్రఉచ్చారణ సరిగ్గా చేయలేరు అందుకని అమ్మవారు ఈ 7 కోట్ల మంత్రములను 7 కోట్ల వృక్షజాతులుగా సృష్టించింది. మంత్రఅనుష్ఠాన ఫలితమును చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా పొందవచ్చును.
రావిచెట్టుకు ఒకసారి ప్రదక్షిణ చేస్తే "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రమును 108 సార్లు జపం చేసిన ఫలితం పొందుతారు. అదే 3 సార్లు ప్రదక్షిణ చేస్తే 1008 సార్లు అష్టాక్షరీమంత్రజపం చేసిన ఫలితం పొందుతారు.
మఱ్ఱిచెట్టుకు ప్రదక్షిణ చేస్తే "ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ స్వాహా" అనే కృష్ణమంత్రం జపం చేసిన ఫలితం వస్తుంది.
ఇంటిలో కడిమి చెట్టు (కదంబవృక్షం) పెట్టుకొని దానికి ప్రదక్షిణ చేస్తే నిత్యం లలితాసహస్రనామం, బాలామంత్రం, పంచదశీ మహామంత్రం, షోడశాక్షరీ మంత్రం జపం చేసిన ఫలితం పొందవచ్చు.
మేడిచెట్టుకు (ఔదుంబర వృక్షము) ప్రదక్షిణ చేస్తే అమ్మవారి యొక్క నవార్ణ మంత్రమును నిత్యం అనుష్ఠానం చేసిన ఫలితం పొందుతారు.
జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సూర్యభగవానుడిని అనుష్ఠానం చేసిన ఫలితం పొందవచ్చు.

expand_less