May 27 2025మే 27 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 27 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం

తిథి: వైశాఖ అమావాస్య ఉ.10.34 కు తదుపరి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి 28 ఉ.8.25 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: కృత్తిక ఉ.5.58 కు తదుపరి రోహిణి 28 తె.4.17 కు తదుపరి మృగశిర 29 రా.3.12 కు
యోగం: సుకర్మ రా.10:53 కు తదుపరి ధృతి 28 సా.7:08 కు
కరణం: నాగ ఉ.8.32 కు తదుపరి కింస్తుఘ్న సా.6:45 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:20-9:12 కు, మ. 11:06-11:51 కు
వర్జ్యం: రా.8.54-10.24 కు
అమృతకాలం: రా.12.00-1.25 కు
సూర్యోదయం: ఉ. 5:31 కు
సూర్యాస్తమయం: సా. 6:21 కు

🕉️ శనైశ్చర జన్మతిథి, హనుమంతుడు బ్రహ్మ మఱియు సకల దేవతల నుండి వరము పొందిన రోజు 🕉️

https://youtu.be/LsZ54-WkjfQ?si=PpGMOpKkUli940dF

గురుబోధ:
పూర్వం సూర్యభగవానుడికి, ఛాయాదేవికి శనైశ్చరుడు వైశాఖమాసం అమావాస్య నాడు జన్మించాడు. అందుకే వైశాఖ అమావాస్య శనైశ్చర జన్మ తిథి అని పిలవబడుతుంది. ఈ రోజు నవగ్రహాలయానికి వెళ్ళడం, అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనైశ్చరుడికి ప్రత్యేకంగా ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వడం లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చొని (శనైశ్చరుడుకి ఎదురుగుండా కూర్చోకూడదు కాబట్టి ఆయనకు అటు పక్క గాని ఇటు పక్క గాని కూర్చొని) అనగా కోణంలో కూర్చుని,
శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం | ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ||
అనే శ్లోకాన్ని చదువుకోవాలి.
వైశాఖమాసం అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుడ్ని పట్టుకోవడానికి ఆకాశానికి ఎగిరాడు, బ్రహ్మ మఱియు సకల దేవతల నుండి అనేక వరములు పొందాడు కాబట్టి ఏదైనా హనుమంతుని స్తోత్రము చదువుకొని, కథ వినాలి.

expand_less