కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟మే 19 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి రా.3.24 కు తదుపరి అష్టమి 20 రా.2.08 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: శ్రవణం మ.3.53 కు తదుపరి ధనిష్ఠ 20 మ.3.38 కు
యోగం: శుక్ల ఉ.5:52 కు, బ్రహ్మ 20 తె.4.35 కు తదుపరి ఐంద్ర 20 రా.2:50 కు
కరణం: వణిజ ఉ.6:12 కు, విష్టి సా. 6:06 కు తదుపరి బవ 20 ఉ.5:52 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:38-1:29 కు, మ. 3:12-4:03 కు
వర్జ్యం: రా.7.51-9.25 కు
అమృతకాలం: ఉ.8.49 - 10.28 కు
సూర్యోదయం: ఉ. 5:31 కు
సూర్యాస్తమయం: సా. 6:21 కు
🕉️ తుంబుర జయంతి 🕉️
గురుబోధ:
తుంబురుడు అద్భుత పాండిత్యం గల గొప్ప గాయకుడు, ఆయన చేతిలో కళావతి అనే వీణ ఉంటుంది.
పిల్లలకు లౌకిక విద్యలతో పాటు బాల్యంలోనే మన ఆచారాలు, పురాణములు, సంగీత సాహిత్య కళలు ఇతర శాస్త్రముల మీద అవగాహన ఉండేట్లు చేయాలి. అవే వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి.