May 17 2025మే 17 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 17 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం

తిథి: పంచమి 18 తె.4.32 కు తదుపరి షష్ఠి 19 తె.4.18 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పూర్వాషాఢ మ.3.07 కు తదుపరి ఉత్తరాషాఢ 18 మ.3.44 కు
యోగం: సాధ్య ఉ.7:08 కు తదుపరి శుభ 18 ఉ.6:42 కు
కరణం: కౌలవ సా.5.39 కు తదుపరి తైతుల 18 ఉ.5.58 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:30-8:21 కు
వర్జ్యం: రా.11.19-12.57 కు
అమృతకాలం: సా.12:36-02:19 కు
సూర్యోదయం: ఉ. 5:31 కు
సూర్యాస్తమయం: సా. 6:21 కు

గురుబోధ:
జగద్గురువైన శ్రీకృష్ణుడే "శ్రీమద్భాగవతం". భాగవత మహిమలేని పురాణం లేదు. ఒక్క భాగవతాన్ని శ్రద్ధగా విన్నవారి వంశంలో 21 తరాలు పూర్వం, మరియు రాబోయే 21 తరాలు అంతా వైకుంఠానికి వెళ్తారు. ఈ భూమి మీద పుట్టిన వారందరూ ఏదో ఒక కారణం చేత పుట్టారు. అందరూ కారణజన్ములే. ఎవరూ తక్కువ కాదు! ఎవరూ ఎక్కువ కాదు! ఆఖరికి ఒక పిచ్చి మొక్క కూడా ఏదో ఒక కారణం చేత భగవంతుడి ద్వారా సృష్టింపబడింది. అందుకే గడ్డిపరకను కూడా తృణముగా భావించకూడదంటారు. అటువంటిది భగవంతుడిని మనము అనుక్షణం అత్యంత జాగరూకులమై పట్టుకోవాలి. ఇక్కడ ఉండగా మనము అహంకరిస్తే మనము చేసినటువంటి పొరపాటుకు ఎక్కడో అక్కడ శిక్షను అనుభవించాలి. శిక్ష అనుభవించే కంటే అసలు పొరపాటే చేయకుండా ఉందామా! అనుకుంటే అలా ఉండడం కుదరదు. అన్నం తింటే అజీర్తి కలుగుతుందని, అసలు అన్నమే తినకుండా ఉండలేం కదా! చేసే పనిలో జాగ్రత్త వహించాలి కానీ అసలు పనే చేయకుండా ఉండకూడదు. చేసే కర్మల వల్ల ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని కర్మలనే విడిచిపెట్టడం సమంజసం కాదు. - శ్రీమద్భాగవతం

expand_less