May 12 2025మే 12 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 12 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: వైశాఖ పూర్ణిమ రా.11.05 కు తదుపరి వైశాఖ బహుళ పాడ్యమి 13 రా.12.58 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: విశాఖ పూర్తిగా ఉంది తదుపరి అనూరాధ
యోగం: వరీయాన్ 13 ఉ.5:52 కు తదుపరి పరిఘ 14 ఉ.6:33 కు
కరణం: విష్టి ఉ.8.15 కు తదుపరి బవ రా. 10.25 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: 12:38-1:29 కు, మ. 3:11-4:02 కు
వర్జ్యం: మ.11.38-1.24 కు
అమృతకాలం: రా.11:18-01:05 కు
సూర్యోదయం: ఉ. 5:34 కు
సూర్యాస్తమయం: సా. 6:18 కు

🕉️ మహావైశాఖి, వైశాఖపూర్ణిమ, శ్రీ కూర్మావతార ఆవిర్భావతిథి, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జన్మతిథి 🕉️

గురుబోధ:
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
https://www.youtube.com/watch?v=oIlCRzW-Qdc&list=PLfgDt5ZsV1JK7ZJl92EnRT2tjvDejx-oT
శ్లో|| వైశాఖ్యామపి పూర్ణాయాం, దానం సర్వస్వ సర్వదమ్|
ధర్మరాజ వ్రతం చాత్ర కథితం తన్నిశామయ||
వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైన పూర్ణిమ. ఈనాడు యమధర్మరాజును భక్తితో పూజించి నీటితో నింపిన పాత్రను శక్తిని బట్టి వెండి, రాగి లేక మట్టిది దానం చేసిన వారికి గోదానఫలం లభిస్తుంది. ధర్మజ్ఞానము కలుగుతుంది. అన్నదానం చేసిన వానికి భూదానఫలితం లభిస్తుంది. ఈ వ్రతాచరణ చేసినవాడు యముని చేత గౌరవింపబడతాడు.
వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మెుదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు ) అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఇవ్వబడింది.

expand_less