కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 10 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: త్రయోదశి రా.2.57 కు తదుపరి చతుర్దశి 11 తె.4.05 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పుబ్బ మ.12.57 కు తదుపరి ఉత్తర 11 మ.2.56 కు
యోగం: వృద్ధి సా.6:58 కు తదుపరి ధ్రువ 11 సా.7:45 కు
కరణం: కౌలవ ప.11.55 కు తదుపరి తైతుల రా.01.01 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:14-11:03 కు, మ. 3:09-3:59 కు
వర్జ్యం: రా.8.44-10.28 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు
🕉️ అనంగ త్రయోదశి, ప్రదోషం 🕉️
https://youtu.be/zGJ46ac1psI?si=NLDeD7FrZjyLHpdf
గురుబోధ:
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవారికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని, ఆలయగోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం శివాశివుల ఐక్యరూపం.