కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 06 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: నవమి రా.1.19 కు తదుపరి దశమి 7 రా.1.17 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పునర్వసు ఉ.9.58 కు తదుపరి పుష్యమి 7 ఉ.9.58 కు
యోగం: సుకర్మ సా.6:55 కు తదుపరి ధృతి 7 సా.6:18 కు
కరణం: బాలవ ఉ.7.19 కు తదుపరి కౌలవ రా.7.23 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:48-5:37 కు
వర్జ్యం: సా.6.02-7.39 కు
అమృతకాలం: రా.11.46-01.26 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు
🕉️ చైత్ర శుక్ల పక్ష నవమి శ్రీరామనవమి - శ్రీరాముడు కౌసల్యా దశరథులకు మరియు జగన్మాత పార్వతీదేవి మేనా హిమవంతులకు జన్మించిన పవిత్ర తిథి - శ్రీ శివ మహాపురాణం
🕉️ శ్రీ సమర్థ రామదాస స్వామి జన్మతిథి -ఇదే రోజు1608 వ సం౹౹ రాణుబాయికి, సూర్యాజీపంతునకు శ్రీ సమర్థ రామదాస స్వామి జన్మించారు. వీరే ఛత్రపతి శివాజీ మహరాజ్ కి గురువులు. వీరు రచించిన "దాసబోధ" శివాజీ మహరాజ్ గారికి నిత్యపారాయణ గ్రంథం. సమర్థ రామదాస స్వామి వారిని హనుమద్ అవతారం గా కీర్తిస్తారు.🕉️
గురుబోధ:
శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో శ్రీ రామవతారం 7వది. ఈ రోజు చేయవలసిన కొన్ని ముఖ్యమైనవి:
1) శ్రీ రామచంద్రప్రభువుని యథాశక్తి శ్రీసూక్తం, పురుషసూక్తంతో అర్చించడం ; 2) శ్రీ రామునికి అష్టోత్తరశతనామావళితో పూజ ; 3) శ్రీ రాముని తులసీదళాలతో అర్చించడం, రామనామజపం ; 4) శ్రీ రామరక్షాస్తోత్రం లేదా సంక్షిప్త రామాయణం పారాయణం ; 5) ఆలయదర్శనం, గురువులకి నమస్కారములు, గుడిలో ప్రదక్షిణలు; 6) హనుమాన్ చాలీసా పారాయణం; 7) భక్తిశ్రద్ధలతో యథాశక్తి దానం
సంక్షిప్త రామాయణం, శ్రీ రామ అష్టోత్తరశతనామావళి
https://youtu.be/rcwdYLX6PBQ?si=LKQPOY4ntVJ66viI
https://srivaddipartipadmakar.org/stotram/sankshipta-ramayanam-100-slokas-balakandamu/pcatid/108/
https://youtu.be/9MvrbV8bMPY?si=JS49J3h-Rk_3TiZG