March 31 2025మార్చి 31 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 31 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: విదియ మ.2.06 కు తదుపరి తదియ 1 ఉ.11.40 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: అశ్విని సా.5.03 కు తదుపరి భరణి 1 సా.3.22 కు
యోగం: వైధృతి మ.1:45 కు తదుపరి విష్కంభ 1 ఉ.8:47 కు
కరణం: కౌలవ ఉ.8:11 కు తదుపరి తైతుల రా.7:25 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:44-1:33 కు, మ. 3:10-3:59 కు
వర్జ్యం: ఉ.10.46-12.16 కు & రా.2.20-3.54 కు
అమృతకాలం: ఉ.7:24-8:48 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు

🕉️ ఉత్తమ మన్వాది, శ్రీ స్వామి సమర్థ జన్మతిథి🕉️

గురుబోధ:
మనం ఆచమనం చేసిన పంచపాత్రలోని నీటిని దేవునికి నైవేద్యం, అర్ఘ్యం, తర్పణం లేదా నీరాజనము ఇవ్వడానికి ఉపయోగించరాదు. అందుకే రెండు పంచపాత్రలు అనగా మన ఆచమనానికి ఒకటి మరొకటి దేవతా పూజకు వాడాలని శాస్త్రం.

expand_less