కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 12 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం
తిథి: మాఘ పూర్ణిమ రా.7.09 తదుపరి పాడ్యమి 13 రా.7.53
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఆశ్లేష రా.7.35 తదుపరి మఖ 13 రా.8.48
యోగం: సౌభాగ్య ఉ. 08.06 కు తదుపరి శోభన 13 ఉ. 07.31 కు
కరణం: విష్టి ఉ.07.05 కు తదుపరి బవ సా.07.23 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.12:07 - 12:53 కు
వర్జ్యం: ఉ.8.03-9.41 కు
అమృతకాలం: సా.5.55-7.35 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు
🕉 శ్రీ ప్రణవపీఠ ద్వాదశ వార్షికోత్సవములు, మహాకుంభాభిషేకం, 2025 ఫిబ్రవరి 10,11 మరియు 12 తేదీలలో🕉
గురుబోధ:
శ్రీ లలితాదేవి ఒక కల్పంలో అవతరించిన రోజుగా మాఘ పూర్ణిమను భావిస్తారు. మాఘపూర్ణిమ రోజు లలితాదేవి ఆరాధన విశేష శుభఫలితాలను ప్రసాదిస్తుంది. పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
మాఘపూర్ణిమ - ద్వాపరయుగం ఆరంభమైన పుణ్యతిథి. ఈ తిథినాడు ఏదైనా ఆలయాన్ని ప్రతిష్ఠిస్తే, ప్రతిష్ఠ చేసినవారు, వారి వారసులు, ఆ కార్యక్రమానికి వెళ్ళినవారు ఈ జన్మలోనే ముక్తి పొందుతారు.- శ్రీ స్కాందపురాణం - కౌమారికా ఖండము.
ఈ తిథులలో చేసే అల్పదానమైనా అనల్పమవుతుంది, అక్షయమవుతుంది, అత్యంత పుణ్యప్రదం. ఎంతోకొంత తమ శక్తిని బట్టి దానం చేస్తే జీవితంలో ఏ లోటూ రాదు.