Feb 08 2025ఫిబ్రవరి 08 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 08 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం

తిథి: ఏకాదశి రా.9.33 తదుపరి ద్వాదశి 9 రా.8.06
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మృగశిర రా.7.32 తదుపరి ఆర్ద్ర 9 రా.6.53
యోగం: వైధృతి మ. 02.04 కు తదుపరి విష్కంభ 9 మ. 12.06 కు
కరణం: వణిజ ఉ.8.49 కు తదుపరి విష్టి రా.8.16 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08:20 - 09:05 కు
వర్జ్యం: రా.3.42-5.15 కు
అమృతకాలం: మ. 3.34 - 5.07 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు

భీష్మ ఏకాదశి
ఏకాదశీ ఉపవాసం ఈ రోజున ఉండాలి. ద్వాదశీ పారణము మరునాడు (ఆదివారం) ఉదయం చేయాలి.

గురుబోధ:
మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం శ్రీ విష్ణు సహస్రనామం. పరమపవిత్రమైన భీష్మ ఏకాదశి నాడు శ్రీ విష్ణుసహస్రనామం, శ్రీ మద్భగవద్గీత లేక ఏదైనా విష్ణుస్తోత్రమును పారాయణం చెయ్యడం వలన విశేష ఫలితం లభించి సకల శుభాలు ప్రాప్తిస్తాయి. భీష్మపితామహుడు పరమధర్మమూర్తి. భీష్మ ఏకాదశి నాడు భీష్ముని గురించి వినడం, భీష్ముని తలచుకోవడం సర్వశుభప్రదం. నేడు వాసుదేవశతనామాలను, విష్ణుసహస్రనామ శ్రవణం (పారాయణం) చేయడం విశేషఫలితాలను ప్రసాదిస్తుంది.
శ్రీ వాసుదేవ శతనామాలు (100) 👇
https://youtu.be/DpjBm71jA_s?si=I5K8k7drqUokdQW3

expand_less