Feb 06 2025ఫిబ్రవరి 06 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 06 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం

తిథి: నవమి 7 తె.5.20 తదుపరి దశమి 7 రా.11.21
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: కృత్తిక రా.9.48 కు తదుపరి రోహిణి 7 రా.8.32
యోగం: బ్రహ్మ సా.06.41 కు తదుపరి ఐంద్ర 7 సా.04.16 కు
కరణం: బాలవ ఉ.11.43 కు తదుపరి కౌలవ రా.8.03 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10.36 - 11.22 కు, మ.03.08 - 03:54 కు
వర్జ్యం: ఉ.10.32-12.02 కు
అమృతకాలం: సా.5.11-6.43 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు

🕉️శ్యామలానవరాత్రులు 7వ రోజు, మధ్వనవమి🕉️

గురుబోధ:
శ్యామలానవరాత్రులలో ఆకుపచ్చరంగులో ఉండేటటువంటి అమ్మవారి పటాన్ని కాని, విగ్రహం కాని పూజా మందిరంలో పెట్టుకుని 9 రోజులు అమ్మను పూజించి పాయసాన్ని నివేదన చేయండి. అలా చేస్తే అమ్మ అనుగ్రహం వల్ల పెళ్ళి కావలసిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది. స్త్రీలకు, పురుషులకు అప్పటికి పెళ్ళి అయిన వారికి ఐకమత్యం పెరుగుతుంది. వార్థక్యంలో ఉన్న వారు వైధవ్యాలు పొందకుండా సుఖంగా కలిసి ఉంటారు. కుటుంబ వృద్ధి, ధనధాన్యవృద్ధి అవుతుంది. అకాలమరణాలు ఉండవు. ఈ నవరాత్రులు అనేక శుభ ఫలితాలు ఇస్తాయి.

శ్యామలా దండకం👇
https://youtu.be/T6JXLm_w3Og?si=ky0fg8cgkdhLRluN

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less