కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 18 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం
తిథి: పంచమి 18 పూర్తిగా; తె. 19 ఉ.7.05 వరకు తదుపరి షష్ఠి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పుబ్బ మ.3.01 కు తదుపరి ఉత్తర 19 సా.5.21 కు
యోగం: సౌభాగ్య రా.12:56 కు తదుపరి శోభన 19 రా.1:15 కు
కరణం: కౌలవ సా.06.26 కు తదుపరి తైతుల 19 ఉ. 7:31 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.8.22-9.06 కు
వర్జ్యం: రా.10.38-12.22 కు
అమృతకాలం: ఉ.6.53 - 8.16 కు
సూర్యోదయం: ఉ. 6:52 కు
సూర్యాస్తమయం: సా. 5:53 కు
🕉️ శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన 🕉️
శ్రీ త్యాగరాజ స్వామి ధ్యాన శ్లోకము
కావేరీ తీర వాసాయ
కారుణ్యామృత వర్షిణే
రామ బ్రహ్మ తనూజాయ
శ్రీ త్యాగరాజాయతే నమ:
గురుబోధ:
పిల్లలకు లౌకిక విద్యలతో పాటు బాల్యంలోనే మన ఆచారాలు, పురాణములు, సంగీత సాహిత్య కళలు ఇతర శాస్త్రముల మీద అవగాహన ఉండేట్లు చేయాలి. అవే వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి.
తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, పడుకున్నా సర్వకాలసర్వావస్థలలో రామనామజపం నిరంతరం చేయడం వలన అదే మనల్ని రక్షిస్తుంది, తరింపచేస్తుంది.