Jan 17 2025జనవరి 17 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 17 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: తదియ తె.4.21 కు తదుపరి చతుర్థి 18 తె.5.33 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మఖ మ.1.23 కు తదుపరి పుబ్బ 18 మ.3.01 కు
యోగం: ఆయుష్మాన్ రా.1.05 కు తదుపరి సౌభాగ్య 18 రా.12:56 కు
కరణం: బవ సా.4.43 కు తదుపరి బాలవ 18 తె.5:30 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.9.06-9.50 కు & మ.12.48-1.32 కు
వర్జ్యం: రా.9.29-11.40 కు
అమృతకాలం: ఉ.8.16 - 09.39 కు
సూర్యోదయం: ఉ. 6:52 కు
సూర్యాస్తమయం: సా. 5:53 కు

గురుబోధ:
భక్తుల స్మరణ చేయడం వల్ల వాళ్ళ సద్గుణాలు మనకు వస్తాయి. అందుకే పెద్దలు ఈ శ్లోకం కంఠస్థం చేసి తరచూ స్మరిస్తూ వారిని తలచుకునేవారు.
శ్లో౹౹ ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్
రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్
పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి

expand_less