కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 12 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం
తిథి: త్రయోదశి ఉ.7.13 కు తదుపరి చతుర్దశి 13 ఉ.6.50 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: మృగశిర ఉ.11.33 కు తదుపరి ఆర్ద్ర 13 ఉ.11.00 కు
యోగం: బ్రహ్మ ఉ. 08:09 కు తదుపరి ఐంద్ర 13 ఉ. 06:44 కు
కరణం: తైతుల ఉ.6.34 కు తదుపరి గరజి సా.05.46 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4.27 - 5.11 కు
వర్జ్యం: రా.7.41 - 9.14 కు
అమృతకాలం: మ. 3:10 - 4:33 కు
సూర్యోదయం: ఉ. 6:52 కు
సూర్యాస్తమయం: సా. 5:53 కు
🕉️ స్వామి వివేకానంద జయంతి🕉️
గురుబోధ:
భగవంతుడు కోరితే ఏదైనా ఇస్తాడు కానీ భక్తిని ఇవ్వడం అంత సాధ్యం కాదని అంటాడు- బ్రహ్మవైవర్త పురాణం
పూర్వం ఐశ్వర్యుడు అనే గంధర్వరాజు వశిష్ఠమహర్షి దగ్గర విష్ణుమంత్రం , శివకవచం, శివస్తోత్రం వంటివి ఉపదేశం తీసుకుని కఠోర తపస్సు చేసాడు. తపస్సుకు మెచ్చిన శివుడు గంధర్వరాజుతో, నిన్ను ఇంద్రలోకానికి అధిపతిని చేయనా, బ్రహ్మ లోకానికి అధిపతిని చేయనా లేదా ఏ కోరిక ఉన్నా తీరుస్తానని అడుగగా, ఆ రాజు, స్వామీ ! ఆ పదవులు ఏవీ శాశ్వతం కాదని నేను ఎఱుగుదును. నాకు ఎల్లవేళలా హరిభక్తిని మఱియు హరిభక్తి పరాయణుడు అయిన పుత్రుని ఇమ్మని కోరతాడు. భక్తిని ప్రసాదించడం అంత సులభం కాదు. ఈ తపస్సు సరిపోదు. అయినా నువ్వు మీ గురువులైన వశిష్ఠుని గురుభక్తితో సేవించి మంత్రం ఉపదేశంగా తీసుకుని శివకేశవులను సమంగా ఆరాధించావు కాబట్టి నీకు భక్తి మఱియు ఉపబర్హణుడు (నారదుడు తన పూర్వ జన్మలో ఒక గంధర్వుడు) అనే పుత్రుడు కలుగుతాడని వరము ఇస్తాడు. ఆ ఉపబర్హణుడు గొప్ప తపస్సు చేస్తాడు. ఒకసారి బ్రహ్మ సభలో చేసిన పొరపాటు వల్ల తరువాతి జన్మలో దాసీపుత్రుడిగా పుట్టి సన్యాసులను, గురువులను సేవించి సకల పురాణములని శ్రవణం చేసి, మంత్రోపదేశం పొంది తరువాత జన్మలో సకల లోక పూజ్యుడైన నారదునిగా అవతరిస్తాడు.
కాబట్టి గురువుల మీద, భగవంతుని మీద సంపూర్ణ భక్తి కలగి ఈ జన్మలోనే తరించడము అంత సులభ సాధ్యం కాదు. నిష్ఠ, శ్రద్ధ సడలకుండా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి.