Dec 11 2024డిసెంబరు 11 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 11 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: ఏకాదశి రా. 10.43 కు తదుపరి ద్వాదశి 12 రా. 8.26 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: రేవతి ఉ. 10.03 కు తదుపరి అశ్విని 12 ఉ. 8.23 కు
యోగం: వరీయాన్ సా. 06.48 కు తదుపరి పరిఘ మ. 03.23 కు
కరణం: వణిజ మ. 02.27 కు
విష్టి రా. 01.09 కు
తదుపరి బవ ఉ. 11.48 కు
బాలవ రా. 10.26 కు

రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.47 - 12.32
వర్జ్యం: తె. 4.38-6.07
అమృతకాలం: ఉ. 7.49 - 9.18 కు
సూర్యోదయం: ఉ. 6.36 కు
సూర్యాస్తమయం: సా. 5.43 కు

🕉️మార్గశిర శుద్ధ ఏకాదశి - గీతాజయంతి🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజున ఉండాలి. ద్వాదశీ పారణము మరుసటి దినం చెయ్యాలి.

https://youtu.be/DpjBm71jA_s

గురుబోధ:
మార్గశీర్ష శుద్ధ ఏకాదశి - గీతాజయంతి నాడు భగవద్గీతాపారాయణము (లేదా) శ్రవణము చేసినవారికి “లక్షగోవులను (1,00,000) దానం చేసిన పుణ్యం, కురుక్షేత్రంలో 5 బారుల బంగారం (30 కి.గ్రా) దానము చేసిన పుణ్యం మఱియు కాశీక్షేత్రంలో ఒక ఎకరము భూదానం చేసిన పుణ్యం కలుగుతుందని శాస్త్రం.”

expand_less