Dec 03 2024డిసెంబరు 03 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 03 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: విదియ మ. 12.24 కు తదుపరి తదియ 4 మ. 12.21 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: మూల సా. 4.45 కు తదుపరి పూర్వాషాఢ 4 సా. 5.11 కు
యోగం: శూల మ. 03.08 కు తదుపరి గండ 4 మ. 01.57 కు
కరణం: కౌలవ మ. 01.09 కు తదుపరి తైతుల రా. 01.12 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.45 - 09.30 కు & రా. 10.49 - 11.41 కు
వర్జ్యం: మ. 3.05 - 4.45 కు & రా. 2.31 - 4.09 కు
అమృతకాలం: ఉ. 10.10 - 11.49 కు
సూర్యోదయం: ఉ. 6.32 కు
సూర్యాస్తమయం: సా. 5.41 కు

గురుబోధ:
"మాసానాం మార్గశీర్షోహం" అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించాడు. మార్గశీర్షమాసం అత్యంత పవిత్రం అనీ, సంవత్సరానికి ఈ మాసం ఆభరణమనీ వాల్మీకి రామాయణం చెపుతున్నది. ఈ మాసంలో తామరపూలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి మహానందాన్ని, సర్వసంపదలనూ ప్రసాదిస్తానని శ్రీమహాలక్ష్మి స్వయంగా అగస్త్యునితో చెప్పింది.

expand_less